ఖాళీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి

  • నిరుద్యోగ సదస్సులో ఆర్.  కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.  విద్యానగర్ బీసీ భవన్ లో ఆదివారం బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన నిరుద్యోగ సదస్సు నిర్వహించారు.

ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ   ప్రజా సమస్యలపై ఉద్యమం చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీ, ప్రజా సంఘాలకు ఉందన్నారు.   యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపల్లి అంజి మాట్లాడుతూ పదేండ్లుగా గ్రూప్ 1, 2  స్థాయి పోస్టుల్లో ఎంతమంది రిటైరయ్యారు? ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారని ప్రశ్నించారు.  టీచర్ పోస్టులు 25 వేలకు పెంచి భర్తీ చేయకపోతే  ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  

నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించి పరిష్కరించాలని కోరారు. బీసీ యువజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా. బి శ్రీనివాస్ ను నియమించారు.  నందగోపాల్, సుధాకర్, సతీష్, ఉదయ్ నేత, పృథ్వి గౌడ్, నిఖిల్, వెంకటేశ్ గౌడ్, బలరాం, జక్క నాగేశ్వరరావు  పాల్గొన్నారు.